JEO (H & E) INSPECTS ARTS COLLEGE _ జూలై 13, 14 వ తేదీలలో ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో నాక్ కమిటీ పర్యటన – జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

TIRUPATI, 12 JULY 2022:  In view of the visit by the NAAC team to the TTD-run Sri Venkateswara Arts College on July 13 and 14, TTD JEO (H & E) inspected the arrangements for the same on Tuesday.

Speaking on the occasion she said preliminary and final inspections have been done today and how they are going to present before the NAAC team about their college has also been verified. Besides, the cleanliness, beautification of the premises, development of greenery, PPT presentation, Expo by depicting the great history of TTD have also been personally observed and discussed with the concerned heads, she maintained.

DEO Of TTD Sri Govindarajan, SV Arts College Principal Smt Narayanamma and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 13, 14 వ తేదీలలో ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో నాక్ కమిటీ పర్యటన – జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి 2022 జూలై 12: తిరుప‌తి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో జూలై 13,14 వ తేదీలలో నాక్ కమిటీ పర్యటిస్తుందని టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో జ‌రుగుతున్న ఏర్పాట్లను జెఈవో మంగళవారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. కళాశాల లోని అన్ని ల్యాబ్ లు తరగతి గదులు మైదానం పరిశీలించారు . న్యాక్ కమిటీకి వివరించే అంశాల గురించి అధ్యాపకులు ,విద్యార్థులతో చర్చించి వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు . కళాశాల కు సంబంధించి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూశారు .

ఈ సంద‌ర్బంగా జెఈవో మాట్లాడుతూ, క‌ళాశాల‌లో జ‌రుగుతున్న మౌళిక వ‌స‌తుల‌
అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేశారన్నారు.
నాక్ కమిటీ సభ్యులకు ఆయా విభాగాల అధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి విభాగానికి సంబంధించిన అంశాలు వివరిస్తారని తెలిపారు. అదేవిధంగా కళాశాలలోని హిస్టరీ విభాగం అద్భుతమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు.

ఇప్ప‌టికే క‌ళాశాల‌కు ఏ గ్రేడ్ గుర్తింపు ఉంద‌ని, నాక్ ఏ ప్ల‌స్ గ్రేడ్ గుర్తింపున‌కు అధ్యాప‌కులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని తెలిపారు .

డిఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.నారాయ‌ణ‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.