JEO INSPECTS DEVUNI KADAPA AND VONTIMITTA TEMPLES _ దేవునికడప, ఒంటిమిట్ట ఆలయాలను పరిశీలించిన టిటిడి జేఈవో
Tirupati, 28 June 2025: TTD JEO Sri Veerabrahmam inspected the ongoing development works at Sri Lakshmi Venkateswara Swamy in Devuni Kadapa Temple and Sri Kodandarama Swamy Temple in Vontimitta on Saturday.
He instructed the officials concerned to speed up works including leak-proofing, electrical upgrades, granite repairs, and preparation for the upcoming Balalayam.
He also emphasized better drainage near the Pushkarini, road widening, strong room setup, parking improvements, and a new vehicle mandapam.
The inspection was attended by Kadapa Municipal Commissioner Sri Manoj Reddy, SE (Electrical) Sri Venkateswarlu, Deputy EOs Sri Natesh Babu and Smt. Prashanthi, several officials and staff.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
దేవుని కడప, ఒంటిమిట్ట ఆలయాలను పరిశీలించిన టిటిడి జేఈవో
తిరుపతి, 2025, జూన్ 28: కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం పరిశీలించారు. కడప, ఒంటిమిట్ట ఆలయాల పరిధిలో శనివారం ఆయన వేరువేరుగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందుగా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. త్వరలోజరుగనున్న బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆలయ గర్భాలయంలో, పోటు గదిలో వర్షం నీరు లీకేజీలు లేకుండా చూడాలని, విద్యుత్ పాత వైర్లు తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గర్భాలయంలో పైభాగాన ఉన్న కాలం చెల్లిన కొయ్య దంతెలను తొలగించే అంశం, ఆలయంలో అవసరమైన గ్రానైట్ పనులు,
పోటు పెంపు, పీఏసీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు, ఆలయం చుట్టూ రోడ్ల విస్తరణ, విలువైన వస్తువులు భద్రపరుచుకునేందుకు స్ట్రాంగ్ రూం ఏర్పాటు, భక్తులకు సౌకర్యవంతంగా పార్కింగ్, నూతన వాహన మండపం, తదితర మరమ్మతుల పనులపై నివేదిక తయారు చేయాలని అధికారులను కోరారు.
పుష్కరిణి వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పోరేషన్ అధికారులకు సూచించారు.
అనంతరం ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి వారి ఆలయం పరిసరాలలో జరుగుతున్న పనులపై జేఈవో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరింతగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద భక్తులకు కనిపించేలా శంఖు చక్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆలయం సమీపంలో 27 నక్షత్రాలు చెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఒంటిమిట్ట ఆలయ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కడప మునిసిపల్ కమీషనర్ శ్రీ మనోజ్ రెడ్డి, ఎస్.ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, ఈఈలు శ్రీ నాగరాజు, శ్రీమతి సుమతి, పలువురు అధికారులు, ఆలయాల అర్చకులు, ఆలయ ఇన్ స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.