JEO INSPECTS RTC BUS STAND IN TIRUMALA _ తిరుమల ఆర్.టి.సి బస్టాండ్‌లో జె.ఇ.ఓ తణిఖీలు
Tiruvenkatapatham route.
Tirumala. He also instructed the PRO to set up an information counter behind the RTC bus stand in Tirumala so that the pilgrims who are alighting the buses at this point will make use of this counter.
తిరుమల ఆర్.టి.సి బస్టాండ్‌లో జె.ఇ.ఓ తణిఖీలు
తిరుమల, 09 మే – 2013: తి.తి.దే తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు గురువారంనాడు తిరుమలలోని ఆర్.టి.సి బస్టాండ్ నందు సి.వి.ఎస్.ఓ శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్ మరియు తిరుపతి ఆర్బన్ జిల్లా ఎస్.పి శ్రీ రాజశేఖర్ లతో కూడి ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు.
అందులో భాగంగా ముందుగా ఆర్.టి.సి బస్టాండ్‌నందు బస్సుల రాకపోకల సరళిని కక్షుణంగా పరిశీలించారు. అనంతరం ఆయన ఆర్.టి.సి ఆర్.యం. శ్రీ నాగశివుడుతో మాట్లాడుతూ ఇకపై బస్సులు విధిగా ఘాట్‌రోడ్డు నందు ప్రయాణ సమయాన్ని 45 నిమిషాలు తప్పక పాటించాల్సి వుంటుందని సూచించారు ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే వారిని కఠినంగా శిక్షించవలసి వుంటుందని ఆయన తెలిపారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలిపిరి చెకెపోస్టు మరియు రెండవ ఘాట్‌రోడ్డు ప్రక్కన హరిణి అటవీ ప్రాతంలో రెండుమార్లు ద్విచక్ర వాహనదారులను బ్రీత్ అనలైజర్ ద్వారా పరిశీలించనున్నామని ఆయన తెలిపారు. తద్వారా తిరుమలకు ఎవరైనా నిషేధిత పదార్థాలను సేవించి వస్తూంటే వారిని అరికట్టడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్.టి.సి బస్సులు బస్టాండు నుండి వెలుపలకు సులువుగా పోవుటకు ఎదురుగావున్న బాటలను విస్తరింపజేయాలని ఆయన ఇనిజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇక ఆర్.టి.సి బస్టాండు వెనుక ప్రాతంలో ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రజాసంబందాధికారి శ్రీ టి. రవిని సూచించారు. తద్వారా భక్తులు బస్సు దిగిన వెంటనే తమకు కావలసిన అవసరాన్ని పొందడానికి ఇది ఉపకరిస్తుందన్నారు.
కాగా అరిపిరి చెక్‌పోస్టు చెంత భక్తులకు తిరుమలలో అందించే వసతి, దర్శన, అన్నప్రసాదం, కల్యాణకట్ట సౌకర్యాలను తెలిపే కరదీపికలను వివిధ భాషలలో ముద్రించి అందించాలని ఆయన తెలిపారు. తద్వారా తిరుమలకు విచ్చేసిన భక్తులు ఆయా సదుపాయాలను సులువుగా పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
ఈ కార్యక్రంలో తి.తి.దే ముఖ్య ఇంజనీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఎస్.ఇ.2 శ్రీ రమేష్‌రెడ్డి, ఆర్.టి.సి డి.ఎమ్. శ్రీ నరసింహా రెడ్డి, పోలీసు అధికారులు మరియు తి.తి.దే విజిలెన్సు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.