JEO INSPECTS SRI SRINIVASA DIVYANUGRAHA HOMAM ARRANGEMENTS _ ఆన్‌లైన్‌లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్లు
TICKETS IN ONLINE ON NOV 16
TIRUPATI, 15 NOVEMBER 2023: TTD JEO Sri Veerabrahmam on Wednesday evening inspected the ongoing arrangements with concerned officials at Alipiri Go Mandiram.
In one of its move to take forward Hindu Sanatana Dharma in a big way, the TTD board has resolved to commence Sri Srinivasa Divyanugraha Homam from November 23 onwards at Alipiri Go Mandiram.
For the same, the online tickets will be released by TTD on November 16 at 2pm. The price of the ticket is fixed as Rs.1000 on which two persons will be allowed.
The devotees are requested to make note of this and book the tickets online to participate in this unique Homam and beget the blessings of Srivaru.
In the inspection, SE2 Sri Jagadeeshwar Reddy, EE Sri Surendranath Reddy, from Alipiri AVSO Incharge Sri Mohan Reddy and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఆన్‌లైన్‌లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్లు
తిరుమల, 2023 నవంబరు 15: హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఇందుకోసం ఆన్‌లైన్ టికెట్లను నవంబరు 16న మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని, ఈ హోమంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరడమైనది.
విశేష హోమం ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో
అలిపిరి వద్ద గల సప్తగోప్రదక్షిణశాలలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ఏర్పాట్లను బుధవారం జెఈవో శ్రీ వీరబ్రహ్మం పరిశీలించారు. హోమం నిర్వహణకు, భక్తులు కూర్చునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
జెఈవో వెంట ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ సిఎఫ్ శ్రీ శ్రీనివాస్, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.