JEO INSPECTS TTD EDUCATION INSTITUTIONS _ టిటిడి విద్యాసంస్థలను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
Tirupati, 11 Nov 20: The JEO for Health and Education Smt Sada Bhargavi inspected TTD educational institutions on Wednesday.
As part of her inspection she verified Covid norms, mid-day meals scheme and teaching in all these institutions.
She inspected Sri Kapileswara Swamy School at Tatitopu, SP Polytechnic College, SPW Degree and PG College and gave some constructive suggestions to the respective principals.
DEO Sri Ramana Prasad was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి విద్యాసంస్థలను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 నవంబరు 11: టిటిడి విద్యాసంస్థల్లో కోవిడ్-19 మార్గదర్శకాలు, మధ్యాహ్న భోజనం అమలుతీరును జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి బుధవారం పరిశీలించారు.
తిరుపతి సమీపంలోని తాటితోపులో గల శ్రీ కపిలేశ్వరస్వామి పాఠశాలను సందర్శించారు. పాఠ్యాంశాల బోధన, రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్-19 మార్గదర్శకాల అమలును పరిశీలించి ప్రధానోపాధ్యాయుడికి పలు సూచనలు చేశారు. ఇస్కాన్ అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసి బోధనకు సంబంధించి పలు సూచనలిచ్చారు.
జెఈఓ వెంట టిటిడి విద్యాశాఖాధికారి డా. ఆర్.రమణప్రసాద్ ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.