JEO RELEASES ANNAMAIAH 519th VARDHANTHI UTSAVAM POSTERS _ అన్నమయ్య 519వ వర్థంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి జెఈవో
Tirupati 21, March 2022: TTD JEO Sri Veerabrahmam on Monday released posters of 519 Annamaiah vardhanti utsavam at his chambers in TTD administrative buildings
Speaking on the occasion the JEO said the fete would be held from March 28- April 1 at Dhyan mandir, Tallapaka, near the 108 feet Annamaiah statue and in Narayanagiri gardens and also Mahati auditorium, and as well Annamacharya Kala mandir Tirupati.
He said the special attraction of celebrations, the Metlotsacam would be held at Padala Mandapam, on March 28 at6.00 am and on March 29 evening sapthagiri sankeertan gosti Ganjam at Narayanagiri gardens.
He said Similar Bhakti sangeet programs will be performed at all locations in Tallapaka, and Tirupati in the evenings from March 29-April 1.
Annamacharya project AEO Sri Sriramulu, program coordinators Lata, and superintendent Sri Ramesh were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నమయ్య 519వ వర్థంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన టిటిడి జెఈవో
తిరుపతి, 2022 మార్చి 21: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్థంతి ఉత్సవాల పోస్టర్లను టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. పరిపాలనాభవనంలోని జెఈవో ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిమహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
మార్చి 28వ తేదీ ఉదయం 6.00 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. మార్చి 29న తిరుమలలో సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహిస్తారన్నారు.
అదేవిధంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఏఈఓ శ్రీ శ్రీరాములు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీమతి లత, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.