JEO REVIEWS ARRANGEMENTS FOR VONTIMITTA BRAHMOTSAVAMS _ ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి: టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం

ANNUAL FEST FROM MARCH 27-APRIL 05

– DHWAJAROHANAM ON MARCH 27

– SRI SITA RAMA KALYANAM ON APRIL 01

Tirupati / Vontimitta, 18 February 2026: TTD JEO Sri Veerabrahmam has directed officials to expedite the arrangements for the upcoming annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple at Vontimitta, scheduled from March 27 to April 05 with Ankurarpanam on March 26, followed by Dhwajarohanam on March 27, celestial Sri Sita Rama Kalyanam on April 01.

Reviewing the progress of works, the JEO conducted a detailed meeting with officials of all departments concerned at Vontimitta on Wednesday. He examined the temporary kitchen and raw material storage sheds be set up in front of the temple and instructed that all works be completed within the stipulated time. 

Adequate tables and chairs should be arranged for devotees partaking in Annaprasadam, he said.

The JEO directed that repair works in the temple and Yagasala be completed on priority. Services of Srivari Sevaks, as being utilized in other TTD temples, should also be engaged at Vontimitta. 

The JEO inspected the proposed photo exhibition area and the venue for cultural programmes near the temple premises.

Later, he reviewed the ongoing development works at the Kalyana Vedika. He inspected the 17 counters arranged for distribution of Talambralu and Annaprasadam, along with the entry and exit gates. 

He instructed officials to bring into use the available water facility at the accommodation complex near the Kalyana Vedika. 

Stressing the need for greenery, he directed Forest Department officials to develop landscaping around the venue and plant saplings along both sides of the road from the temple to Kalyana Vedika.

During the review meeting, the JEO instructed that queue lines, devotee shelters, signboards, drinking water facilities, and engineering works be completed on time. 

Other important instructions :

Roads, especially the Mada streets through which the chariot marches, should be repaired without any delay. 

Attractive cut-outs, illumination, and floral decorations should be arranged to enhance the festive atmosphere.

Staff from all departments of TTD be deployed on deputation for the smooth conduct of the Brahmotsavams.

Adequate medical arrangements, including first-aid centres, expert medical staff, medicines, and ambulances, should be made to ensure devotees face no inconvenience. 

Continuous chanting of “Sri Rama Nama” should be broadcast through the public address system.

Prachara Radhams should tour surrounding villages for ten days to distribute pamphlets and create awareness about the Brahmotsavams. 

Special arrangements must be made for the smooth distribution of Annaprasadam to the large number of devotees expected for the Kalyanam.

Buttermilk and drinking water counters should be set up extensively to provide relief from the summer heat.

TTD Vigilance officials to coordinate with local police to ensure proper security and parking arrangements. 

LED screens should be installed for devotees to witness the Vahana Sevas. 

Cultural programmes and Kavi Sammelanam should be organized under the aegis of DPP. 

Bhajan troupes of Hindu Dharma Prachara Parishad should perform ahead of the Vahana Sevas. 

Special programmes should also be arranged on the day of Kalyanotsavam.

The keertanas penned by Sri Vavikolanu Subbarao, who contributed to the renovation of the Vontimitta temple, be printed and distributed among devotees. 

TTD’s Public Relations Department to undertake wide publicity through social media.

TTD CE Sri Satyanarayana, SE Sri Manoharam, Sri Venkateswarlu, EE Sri Narasimhammurthy, CPRO Dr T. Ravi, CMO Dr Kusuma Kumari, Temple Deputy EO Smt Prasanthi, Additional Health Officer Dr Sunil, HDPP Special Officer Sri Sriram Raghunath and other officials were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి:

మార్చి 26 అంకురార్పణ, 27 ధ్వజారోహణం

–  ఏప్రిల్ 1 శ్రీ సీతారాముల క‌ల్యాణం

–  టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం 

తిరుపతి / ఒంటిమిట్ట‌ 2026 ఫిబ్రవరి 18: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని టిటిడి జెఈవో శ్రీ వి. వీర‌బ్ర‌హ్మం అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టివ‌ర‌కు చేప‌ట్టిన బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల ప‌నులు, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, భ‌విష్య‌త్తులో చేప‌ట్టాల్సిన ప‌నుల‌ను ప‌రిశీలించి, అన్ని విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో అధికారుల‌తో క‌లిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ‌ ఉంచే షెడ్లను పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబులు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోను, యాగశాలలో మరమత్తు పనులు త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. టిటిడి స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో వినియోగించుకోవాల‌ని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు.

అనంత‌రం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్న‌ప్ర‌సాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదమును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. 

ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపుల మొక్కలు పెంచాలని సూచించారు. కళ్యాణ వేదిక వద్ద విఐపిలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

అటు తర్వాత జేఈవో అధికారుల‌తో నిర్వ‌హించిన సమీక్ష స‌మావేశంలో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం, తదితర ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. రథం తిరిగే వీధులను, ముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా కటౌట్లు,  విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని విభాగాల సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించాలన్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాం క‌లుగ‌కుండా ప్రధమ చికిత్స కేంద్రాలు,  నిపుణులైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా నిరంతరాయంగా శ్రీరామనామం ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు 10 రోజులపాటు ప్రచార ర‌థాల‌ ద్వారా పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, బ్ర‌హ్మోత్స‌వాల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు.

స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల వాహ‌న‌ సేవ‌లను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్.ఈ.డి స్క్రీన్ లు ఏర్పాటు చేయాలని, హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనము ఏర్పాటు చేయాల‌న్నారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన బృందాలచే ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉండాలని, అలాగే కల్యాణోత్సవం రోజున చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.  

ఒంటిమిట్ట ఆలయ పునఃనిర్మాణానికి కృషి చేసిన‌ శ్రీ వావికొలను సుబ్బారావు రచించిన కీర్తనలను ముద్రించి, పుస్త‌కాలను భ‌క్తుల‌కు పంపిణీ చేయాలన్నారు. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు

ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ టి.వి.సత్యనారాయణ,  ఎస్ఇలు శ్రీ మనోహర్, శ్రీ నరసింహమూర్తి, ఎస్ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, సిపిఆర్ఓ డా. టి.రవి, సీఎంవో డా.కుసుమ కుమారి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, అదనపు ఆరోగ్యశాఖ అధికారి శ్రీ డా. సునీల్, డిపిపి ప్రత్యేక అధికారి శ్రీ రఘునాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది