JEO REVIEWS ON LOCAL TEMPLES DEVELOPMENT_ టిటిడి స్థానిక ఆల‌యాల‌పై జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం స‌మీక్ష‌

Tirupati, 19 Mar. 19: Tirupati JEO Sri B Lakshmi kantham on Tuesday evening reviewed on the development of various local shrines under the umbrella of TTD with concerned Deputy EOs.

The review meeting took place in his bungalow in Tirupati. During the mee the JEO instructed the Deputy EOs of all temples to maintain Tiruvabharanam, Padi kavali, Kanuka registers, in a proper manner as per the recommendations of Justice Jagannadha Rao and Justice Wadhwa Committees.

He also directed them to keep the temple premises clean. As the festival of Ugadi is fast approaching, he directed all to organise the fete in a big in all the local temples with Nadaswaram, Veda swathi and Panchanga Sravanam.

SE 1 Sri M Ramesh Reddy, DyEO General Smt Goutami IAS, other temple Deputy EOs were also present.


JEO VISITS TARIGONDA TEMPLE

Earlier Tirupati JEO visited Sri Lakshmi Narasimha Swamy temple at Tarigonda located at about 100kms away from Tirupati in Chittoor district.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి స్థానిక ఆల‌యాల‌పై జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం స‌మీక్ష‌

తిరుప‌తి, 2019 మార్చి 19: టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో టిటిడి నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా రిజిష్ఠ‌ర్‌ల‌ను నిర్వ‌హించాల‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని జెఈవో నివాసంలో మంగ‌ళ‌వారం సాయంత్రం అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ వాద్వా క‌మిటి, జ‌గ‌న్నాధం క‌మిటి సూచ‌న‌ల మేర‌కు ప్ర‌తి ఆల‌యంలో స‌దా స‌మ‌ర్ప‌ణ‌, ప‌డికావిలి, కానుక‌లు, తిరువాభ‌ర‌ణాల రిజిష్ఠ‌ర్ల‌ను త‌ప‌న్నిస‌రిగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క‌ల్యాణ మండ‌పాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. ఆయా ఆల‌యాల ఉన్న‌తాధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు నిర్వ‌హించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాలన్నారు.. .ప్ర‌తి ఉద్యోగి ఐడి కార్డు, శ‌నివారం డ్ర‌స్ కోడ్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌న్నారు. కార్య‌ాల‌యాల‌లో ఉద్యోగుల రిజిష్ఠ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఏర్ప‌ాటు చేయాల‌న్నారు. టిటిడిలో ప్ర‌తి ఫైల్ ఈ – ఫైలింగ్ విధానంలో పంపాల‌న్నారు. ప్ర‌తి దేవాల‌యంలో సిసి కెమెరాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప‌ని చేస్తున్నాయి, ఎన్ని ప‌ని చేయ‌డం లేదనే విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌తాధికారుల దృష్ఠికి తీసుకురావాల‌ని విజిలెన్స్ అధికారుల‌ను ఆదేశించారు.

అనంత‌రం ప‌ర‌కామ‌ణి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌తి ఉద్యోగికి నెల‌లో రెండు సార్లు మాత్ర‌మే ప‌ర‌కామ‌ణి విధులు నిర్వ‌హించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఎలాంటి పిర్యాధులు లేకుండా చూడాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.

ఈ స‌మావేశంలో డెప్యూటీ ఈవో (జ‌న‌ర‌ల్) శ్రీ‌మ‌తి గౌత‌మి ఐఏఎస్‌, ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, శ్రీ శ్రీ‌ధ‌ర్‌, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ‌మ‌తి క‌స్తూరి, డిపిపి కార్య‌ద‌ర్శి శ్రీ ర‌మ‌ణ ప్ర‌సాద్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.