JUBILEE HILLS SV TEMPLE BTUs BEGINS WITH DWAJAROHANAM _ ధ్వజారోహణంతో జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirupati, 01 March 2022: Dwajarohanam was performed in the auspicious Mesha lagnam between 10.30am and 10.40 am commencing annual Brahmotsavam of Sri Venkateswara Swamy temple located in Jubilee Hills at Hyderabad on Monday.
Earlier Tiruchi utsavam was performed while Pedda Shesha Vahanam will be held in the evening.
TTD Chairman Sri YV Subba Reddy, Hyderabad local advisory committee president Sri Bhaskar Rao, Vice President Sri Venkat Reddy, Sri Ravi Prasad, Smt Lakshmi, AEO Sri Jaganmohacharyulu were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ధ్వజారోహణంతో జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2022 మార్చి 01: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ఉదయం 10.30 నుండి 10.40 గంటల మధ్య మేష లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. అంతకుముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, హైదరాబాద్ స్థానిక సలహామండలి అధ్యక్షులు శ్రీ భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు శ్రీ వెంకట్ రెడ్డి, శ్రీ రవి ప్రసాద్, శ్రీమతి లక్ష్మి, ఏఈఓ శ్రీ జగన్మోహనాచార్యులు ఇతర సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.