JYESTABHISHEKAM COMMENCES IN TIRUMALA TEMPLE _ శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
Tirumala, 22 Jun. 21: The annual Jyestabhishekam commenced on a religious note in Tirumala temple on Tuesday.
This ritual is usually observed to ensure that wear and tear does not happen to the age old processional deities due to year-long festivities. TTD has been observing this fete since 1990 in the month of Jyesta every year.
As part of this fete, Shanti Homam, Satakalasa Pratista, Nava Kalasa Pratista, Kankana Pratista etc. done to deities and Snapana Tirumanjanam performed while reciting Pancha Suktams.
Sri Malayappa draped in Vajra Kavacham took on a celestial ride along four mada streets after Sahasra Deepalankara Seva in the evening.
It’s on this day in a year that the Utsavamurty of Srivaru appears to devotees in Diamond armour.
Addl EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Haridranath, Temple officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
తిరుమల, 2021 జూన్ 22: తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.
వజ్ర కవచంలో స్వామివారు దర్శనం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరిస్తారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండగా బుధవారం ముత్యపుకవచంతో, గురువారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.