JYESTABHISHEKAM CONCLUDES IN SRIVARI TEMPLE _ వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం
SRI MALAYAPPA SWAMY AND HIS CONSORTS SHINE IN GOLDEN KAVACHAM
TIRUMALA, 11 JUNE 2025: The three-day sacred Festival of Jyestabhisekam concludes on a grand note at the Srivari temple on Wednesday morning as Sri Malayappaswamy and his consorts were re-draped once again in gold kavacham.
Earlier after Maha Shanti homam at the Kalyana Mandapam in the Sampangi Prakaram, the utsava idols were given snapana thirumanjanam before adorning them in gold kavacham.
Later in the evening, the utsava idols were taken around in procession in the mada streets to bless the devotees. The TTD cancelled arjita sevas like the Kalyanotsavam, unjal seva, arjita Brahmotsavams to facilitate the Jyestabhisekam rituals.
Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD Board Member Smt Suchitra Ella, Addl EO Sri C.H. Venkaiah Chowdary, Peishkar Sri Rama Krishna and Others Participated.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం
స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు
తిరుమల, 2025 జూన్ 11: వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునర్ దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, పేష్కార్ శ్రీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.