JYESTABHISHEKAM IN SRI GT _ జులై 19 నుండి 21వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం
Tirupati, 6 Jul. 21: The annual Jyestabhishekam will be observed in Sri Govinda Raja Swamy temple in Tirupati from July 19 to 21 in Ekantam due to Covid restrictions.
Every year this fete will be observed for three days in the month of Ashada. On the first day Kavachadhivasam, Second-day Kavacha Pratista and on the final day Kavacha Samarpanam will be performed.
During these three days, there will be Snapana Tirumanjanam in the morning to Utsava Deities and procession in the evenings.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జులై 19 నుండి 21వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం
తిరుపతి, 2021 జులై 06: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జులై 19 నుండి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ మూడు రోజుల ఈ ఉత్సవాలను ఆలయంలోపల ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జులై 19న కవచాధివాసం, జులై 20న కవచ ప్రతిష్ఠ, జులై 21న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తరువాత మహాశాంతి హోమం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపడతారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.