JYOTHISHYA SHASTRA DIRECTS THE HUMAN LIFESTYLE _ జ్యోతిష్య శాస్త్రంతోనే మానవ మనుగడకు దశా నిర్దేశం
TIRUPATI, 03 DECEMBER 2023: Sri Chakravarthy Ranganathan, professor of National Sanskrit Vidyapeeth, informed that human survival is determined by Jyothishya Sastra (astrology)as revealed in Pancharatra Agama.
Under the joint auspices of TTD Alwar Divya Prabandha Project, Bhagwatshastra Pancharatra Agama Samrakshana Sabha, the Akhila Bharata Bhagwatshastra Pancharatra Agama Vidwat Sammelan concluded on Sunday at the Asthana Mandapam at Sri Padmavati Ammavari Temple in Tiruchanur.
Acharya Ranganathan, who was the special guest of the program, said that Indian dance, music, musical instruments and astrology are involved in Pancharatra Agama.
Sri Vamanacharyulu, Sri Bhagavad Ramanujacharyulu, Sri Vedanta Desikar sustained the tenets of Pancharatra Agama.
Later, the book “Sri Bhavishyakara Samhita” of Pancharatra Agama Shastra was unveiled by Sri LN Bhattar, a retired professor of National Sanskrit Vidyapeeth.
Later students and teachers of Tirumala Dharmagiri Veda Vigyana Peetham, SV Vedic University, Melkoti Vedic School, Srirangam Vedic School participated.
TTD Sri Pancharatra Agama Advisor Sri Srinivasacharyulu, Alwar Divya Prabandha Project Co-ordinator Sri Purushottam and others participated in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జ్యోతిష్య శాస్త్రంతోనే మానవ మనుగడకు దశా నిర్దేశం
– ఘనంగా మూసిన పాంచరాత్ర ఆగమ సదస్సు
తిరుపతి, 2023 డిసెంబరు 03: పాంచరాత్ర ఆగమంలో తెలియజేసిన జ్యోతిష్య శాస్త్రంతోనే మానవ మనుగడకు దశా నిర్దేశమని జాతీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్ తెలియజేశారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, భగవత్‌శాస్త్ర పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ సంయుక్త ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో అఖిల భారత భగవత్‌శాస్త్ర పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం ఆదివారం ఘనంగా ముగిసింది.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య రంగనాథన్ మాట్లాడుతూ, పాంచరాత్ర ఆగమంలో భారత నాట్యం, సంగీతం, వాద్యం, జ్యోతిష్య శాస్త్రాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. శ్రీ వామనాచార్యులు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీ వేదాంత దేశికర్ పాంచరాత్ర ఆగమాన్ని రక్షించారని వివరించారు.
అనంతరం పాంచరాత్ర ఆగమ శాస్త్ర విశేషాలకు చెందిన ” శ్రీ భవిష్యకర సంహిత” గ్రంధాన్ని జాతీయ సంస్కృత విద్యాపీఠం విశ్రాంత ఆచార్యులు ఎల్ ఎన్ భట్టర్ ఆవిష్కరించారు.
తరువాత తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వి వేద విశ్వవిద్యాలయం, మేల్కోటి వేద పాఠశాల, శ్రీరంగం వేద పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని పాంచరాత్ర ఆగమ విశేషాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసచార్యులు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.