KALABHAIRAVA HOMAM COMMENCES _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రక్తంగా శ్రీ కాల‌భైర‌వ హోమం

TIRUPATI, 30 NOVEMBER 2024: As a part of month long Homa Mahotsavams, Kalabhairava Homam commenced in Sri Kapileswara Swamy temple on Saturday.
 
On Sunday Sri Chandikeswara Homam will be observed.
 
The month-long Homa Mahotsavams will conclude on December 2.
 
DyEO Sri Devendra Babu and other temple staff, devotees were present.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రక్తంగా శ్రీ కాల‌భైర‌వ హోమం

తిరుపతి, 2024 నవంబరు 30: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం శ్రీ కాల‌భైర‌వ‌ హోమం ఘ‌నంగా జ‌రిగింది.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్ట‌భైర‌వ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, శ్రీ కాల‌భైర‌వ మూల‌వ‌ర్ల‌కు క‌ల‌శాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు శ్రీ చండికేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ‌, జ‌పం, హోమం, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

డిసెంబరు 1న చండికేశ్వర హోమం :

హోమ మహోత్సవాల్లో చివరి రోజైనా డిసెంబరు 1వ తేదీ చండికేశ్వర హోమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.