KALIYAMARDHANA KRISHNA MUSES DEVOUT _ కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

VONTIMITTA /TIRUMALA, 13 APRIL 2025: The annual Brahmotsavams at Vontimitta in Kadapa district on the penultimate day on Sunday witnessed Sri Ramachandra Murty blessing His devotees in Kaliyamardhana Alankaram.

Meanwhile the Navahnika Brahmotsavams will conclude with Chakra Snanam and Dhwajavarohanam on Monday.

While the Pushpayagam will be observed on April 15  between 6pm and 9pm.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట / తిరుపతి 2025 ఏప్రిల్ 13: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.

ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో
శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్
శ్రీ నవీన్ , భక్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 14న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.

ఏప్రిల్ 15న పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.