KALIYAMARDHANA KRISHNA GRACES ON SARVABHOOPALA _ సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

TIRUPATI, 03 DECEMBER 2024: On the sixth day of the ongoing annual Karthika Brahmotsavam at Tiruchanoor on Tuesday, Sri Padmavati Devi in Kaliyamardhana Krishna Alankaram blessed Her devotees along four mada streets on Sarvabhoopala Vahanam.

Both the Pontiffs of Tirumala, EO Sri J Syamala Rao, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

తిరుపతి, 2024 డిసెంబరు 03: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.

సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించునున్నారు.

వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ జె.శ్యామల రావు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.