KALIYAMARDHANA ON MUTYAPU PANDIRI _ ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

TIRUPATI, 19 JUNE 2024: Sri Kaliyamardhana blessed devotees on pearl canopy on Wednesday evening.

As a part of ongoing annual Brahmotsavam in Appalayagunta, Sri Prasanna Venkateswara Swamy took out a celestial ride on Mutyapu Pandiri Vahanam.

Nagari Legislator Sri Gali Bhanuprakash, temple staff, and devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి, 2024 జూన్ 19: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో నగిరి ఎంఎల్ ఏ శ్రీ గాలి భాను ప్రకాష్, ఆలయ ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టార్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.