KAPILESWARA ON KALPAVRIKSHA _ కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు

TIRUPATI, 25 FEBRUARY 2025: The ongoing annual Brahmotsavam at Sri Kapileswara Swamy temple witnessed Sri Kapileswara riding Kalpavriksha Vahanam on Tuesday.

On the seventh day the deity in all His religious splendour blessed His devotees amidst grand devotional treat by the dances by various artistes in front of Vahanam.

Later Snapana Tirumanjanam was performed to the processional deities.

DyEO Sri Devendra Babu, AEO Sri Subbaraju and other temple staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు

తిరుపతి, 2025 ఫిబ్రవరి 25: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 7 గంట‌ల‌కు శ్రీ కపిలేశ్వరస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.