KALPAVRIKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో సిరుల తల్లి
TIRUPATI, 13 NOVEMBER 2023: Kalpavriksha Vahana Seva was held with religious fervour in Tiruchanoor on Monday.
On the 4th day of the ongoing annual Karthika brahmotsavam at Tiruchanoor Sri Padmavathi Devi in Rajamannar Alankaram blessed Her devotees on the finely decked Kalpavriksha Vahanam.
The Vahanam was characterised by Kamadhenu and other celestial items emerged from the churning of the milk ocean which enhanced the grandeur of the carrier.
Both the Pedda Jeeyar and Chinna Jeeyar Swamijis of Tirumala, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy and others were present.
కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో సిరుల తల్లి
తిరుపతి, 2023 నవంబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం అమ్మవారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో చర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.
పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించారు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.
మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేస్తారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
అలాగే రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి,
జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, విఎస్‌వో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.