KALPAVRIKSHA VAHANAM HELD _ కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభ‌యం

Tirupati, 30 March 2025: On the fourth morning, Sri Kodandarama along with Sita Devi and Lakshmana Swamy, took out a celestial ride on Kalpavriksha Vahanam on Sunday.

The bright Sunny day witnessed the deities shining brightly on divine tree carrier wishing the devotees.

DyEO Smt Nagaratna, AEO Sri Ravi and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభ‌యం

తిరుపతి, 2025 మార్చి 30: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉదయం 8 గంట‌ల‌కు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను అభ‌య‌మిచ్చారు.

ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు.

అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది