KALYANA SRINIVASA GRACES ON SARVABHOOPALA _ సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు

Tirupati, 27 Feb. 22: Sri Kalyana Srinivasa graced on Sarvabhoopala Vahanam with His two consorts on Sunday morning.

 

Due to Covid restrictions instead of Swarna Ratham, the Sarvabhoopala Vahanam was observed in Ekantam.

 

JEO Sri Veerabrahmam, DyEO Smt Shanti, AEO Sri Gurumurthy and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2022 ఫిబ్రవరి 27: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ఉదయం 7.35 నుండి 8.30 గంటల వ‌ర‌కు రథోత్సవం బదులుగా స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌ల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

వాహ‌న సేవ‌లో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.