KALYANA VENKATESWARA AS SARASWATI DEVI BLESSES DEVOTEES _ హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2025 ఫిబ్రవరి 19: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి

హంస వాహనసేవలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేకాధికారి మ‌రియు సిపిఆర్వో డా.టి.ర‌వి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Tirupati, 19 February 2025: Amidst grand illumination and colourful performances by various artists, the procession of Hamsa Vahana seva took place at Srinivasa Mangapuram on the second evening.

Devotees were delighted to witness the lord in Saraswati Devi Alankaram.

Special officer and CPRO Dr T Ravi, Spl. Gr. DyEO Smt Varalakshmi and others were also present.

Meanwhile, the electrical illumination and electrifying performance by dance troupes in front of vahanam enhanced the grandeur of Vahana Seva.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI