KALYANAM PERFORMED _ వైభవంగా శ్రీ ప్రసన్నవేంకటేశ్వర స్వామి కల్యాణం
TIRUPATI, 03 JUNE 2023: The celestial Srivari Kalyanam was observed in a grand manner at Appalayagunta on Saturday evening.
The divine wedding was observed with grandeur as per the Hindu marriage tradition between 4pm and 6pm.
Devotees participated with devotional fervour to beget the blessings of Sri Bhu sameta Sri Prasanna Venkateswara.
DyEO Sri Govindarajan, Superintendent Smt Srivani and temple inspector Sri Siva Kumar were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ ప్రసన్నవేంకటేశ్వర స్వామి కల్యాణం
తిరుపతి, 2023 జూన్ 03: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.
డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్
శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.