KAMAKSHI NAVARATRI UTSAVAM AT KAPILESWARA SWAMY TEMPLE FROM OCT 15-23 _ అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు
Tirupati,03 October 2023: TTD is organising Sri Kamakshi ammavari Sharanavaratri utsavams at Sri Kapileswara temple from October 15-23 wherein Goddess Kamakshi will bless devotees in a different alankaram every day.
In this connection, TTD is performing the Koil Alwar Tirumanjanam fete (temple cleansing) at the temple on October 11.
Prominent events of the nine-day festivities of the Sharanavaratri utsavams includes:
October 15- Kalasha Sthapana and Ankurarpanam. October 16 – Sri Kamakshi alankaram,17 Sri Adiparashakti ,18 Mahalakshmi,19- Sri Annapurna Devi,20- Sri Durga Devi,21- Sri Mahishasuramardini , 22- Sri Saraswati Devi,23- Sri Shiva Parvatulu alankaram on Vijayadashami day.
As part of cultural programs the TTD’s Hindu Dharma Prachara Parishad, Annamacharya project will render Bhakti sangeet, Devi Bhagavatha Purana pravachanams and Lalita Sahasranama Parayanams.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి, 2023 అక్టోబరు 03: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ ఉత్సవాల నేపథ్యంలో అక్టోబరు 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
అక్టోబరు 15న కలశస్థాపన, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 16న శ్రీ కామాక్షి దేవి, 17న శ్రీ ఆదిపరాశక్తి, 18న మహాలక్ష్మి, 19న
శ్రీ అన్నపూర్ణాదేవి, 20న దుర్గాదేవి, 21న శ్రీ మహిషాసురమర్థిని, 22న శ్రీ సరస్వతిదేవి,
23న విజయదశమి సందర్భంగా శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.