KANCHI SEER LAUDS TTD SCULPTURE SCHOOL _ శిల్పకళాశాల నిర్వహణ అభినందనీయం – కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అభినందన

Tirupati, 09 February 2022: The Pontiff of Kanchi Kamakoti Peetham Sri Sri Sri Vijayendra Saraswati Swami lauded the TTD for running a sculpture school encouraging the young talents. The pontiff visited the SV Sculpture School on Wednesday evening and also went around all sections and classrooms and enquired about sources of granites and tools used Kalamkari paintings, and colours used.

 

Later interacting with students he said the sculpture skills were historical and such skills will promote students to greater heights.

 

The pontiff said the Kanchi peetham conducted conferences on Veda, Agama and Science of Sculpture and prominent exponents like Padmasri Ganapati Shastri and Padmavibushan V Ganapati Shastri participated

Later

 

Devasthanam Education Officer Sri Govindarajan and Principal of Sculpture School Sri Venkata Reddy were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శిల్పకళాశాల నిర్వహణ అభినందనీయం

– కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అభినందన

తిరుపతి 9 జనవరి 2022: టీటీడీ లాంటి ధార్మిక సంస్థ సాంప్రదాయ శిల్పకళాశాల నిర్వహించడం అభినందనీయమని కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అభినందించారు.

బుధవారం సాయంత్రం ఆయన శిల్పకళాశాలను సందర్శించారు. కళాశాలలోని అన్ని విభాగాల తరగతి గదులను పరిశీలించారు. శిల్పాలు చెక్కడానికి రాయి ఎక్కడి నుంచి తెస్తున్నారు. ఏ చెక్క వాడుతున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలంకారీ పెయింటింగ్ ఎలా చేయిస్తున్నారు. రంగులు ఎలా తయారు చేస్తున్నారు అని అధికారులను అడిగారు. అనంతరం కంచి స్వామి విద్యార్థులతో మాట్లాడారు.

సంప్రదాయ శిల్పకళ ఈ నాటిది కాదన్నారు. ఇందులో నైపుణ్యం సంపాదిస్తే జీవితంలో.మంచి స్థాయికి చేరుకోవచ్చునని చెప్పారు. కంచిపీఠం ప్రతి ఏటా వేద,ఆగమ, శిల్ప శాస్త్రాలపై సదస్సు నిర్వహిస్తోందన్నారు. పద్మభూషణ్ వి.గణపతి శాస్త్రి, పద్మశ్రీ గణపతి శాస్త్రి లాంటి వారు ఇందులో పాల్గొన్నారని అన్నారు. దేవస్థానం విద్యాశాఖాధికారి శ్రీ గోవింద రాజన్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకట రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సబంధాల అధికారిచే విడుదల చేయడమైనది