KAPILESWARA BLESSES DEVOTEES ON NANDI VAHANAM _ నంది వాహనంపై కైలాసనాథుడు

TIRUPATI, 15 FEBRUARY 2026: On the auspicious occasion of Mahashivratri on Sunday evening, Sri Kamakshi sameta Sri Kapileswara Swamy took out for a celestial ride on the divine Nandi Vahanam along the streets of the temple city to bless the devotees.

All roads led to Kapilatheertham to have darshan of the processional deity on Nandi Vahana.

TTD has made elaborate arrangements of queue lines, barricades, Annaprasadam and water distribution on the occasion and made traffic regulations with the help of local police ensuring devotees a hassle free vahana darshan.

Lingodhbhava Kala Abhishekam 

On February 16, from 12am till 4am, Lingodhbhava Kala Abhishekam will be performed. From 8am onwards, the devotees will be allowed for darshan.

TTD CVSO Sri Muralikrishna, Temple Special Officer Sri Phani Kumar Naidu, Superintendent Sri Chandrasekhar, temple priests and other temple staff were present during Nandi Vahana Seva.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

నంది వాహనంపై కైలాసనాథుడు

తిరుపతి, 2026 ఫిబ్రవరి 15: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం రోజైన ఆదివారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు.

భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మ‌హావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.

లింగోద్భవకాల అభిషేకం

ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ సోమ‌వారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

వాహ‌న సేవ‌లో టీటీడీ సివిఎస్వో శ్రీ కే.వి.ముర‌ళికృష్ణ‌, ఆలయ ప్ర‌త్యేకాధికారి శ్రీ డి.ఫ‌ణికుమార్ నాయుడు, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌క‌లు విశేష‌ సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.