KARNATAKA ART FORMS STEAL THE DAY _ ముత్యపుపందిరి వాహనసేవలో కళావైభవం
TIRUMALA, 20 SEPTEMBER 2023: The evening of day three as a part of the ongoing annual brahmotsavam in Tirumala witnessed a series of unique dance formats enthralling devotees in a big way on Wednesday.
The artforms included Kuchipudi Dance, by the students of TTD Dance and Music College followed by Kunita Sankirtana by Patakunita, Mysore, Yakshaganam, Pata Kunita, Kansale Kunita, Chilipili Gombe and potraying different deities.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముత్యపుపందిరి వాహనసేవలో కళావైభవం
తిరుమల, 2023 సెప్టెంబరు 20: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి ముత్యపుపందిరి వాహన సేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి.
శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు కూచిపూడి నృత్యం చక్కగా ప్రదర్శించారు. అదేవిధంగా, కర్ణాటక భజన సంప్రదాయానికి చెందిన కునిత సంకీర్తన ఆకట్టుకుంది. దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన ప్రాచీన కళావిన్యాసం యక్షగానం చక్కగా సాగింది. అనంతపురానికి చెందిన కళాబృందం కృష్ణ లీలా విశేషాల గురించి మనోహరంగా ఆడుతూ పాడుతూ నృత్యం చేశారు. కూచిపూడి నృత్యాన్ని పోలిన దాసకృతి నృత్య విన్యాసం అలరించింది. శ్రీరంగానికి చెందిన శ్రీ భరత కళా అకాడమి బృందం దాసగణ వైభవాన్ని ప్రదర్శించారు.
బెంగుళూరుకు చెందిన కల్పశ్రీ కళావేదిక వైష్ణవ వైభవాన్ని చాటేలా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి వేషధారణలో నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. పటకునిత లేదా నందిద్వజ అని పిలువబడే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ కళారూపకంలో ప్రధానంగా నందికోలలతో, సమాల, చండీ అని పిలువబడే వాయిద్య విన్యాసాలతో నయనానందకరంగా సాగింది. కంసాలే కునిత అని పిలువబడే ఈ కర్ణాటక కళారూపకం మలై మహదేశ్వర అని పిలువబడే శైవ సంప్రదాయానికి చెందిన ప్రసిద్ద కర్ణాటక జానపద కళారూపం. ఉడిపి ప్రాంతానికి చెందిన తులు సంప్రదాయ కళా విన్యాసం చిలిపిలి గొంబె మనోహరంగా సాగింది. తిరుపతికి చెందిన కళాకారులు శ్రీమదానందనిలయవాస నృత్యరూపకాన్ని, విజయవాడకు చెందిన కళా బృందం గోపికలు కృష్ణునితో కలిసి కోలాటం చేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.