KARTHIKA BRAHMOTAVAMS IN TIRUCHANOOR FROM NOVEMBER 20 _ నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 09 NOVEMBER 2022: The annual Karthika Brahmotsavams of Sri Padmavathi Devi Ammavaru in Tiruchanoor will be observed between November 20-28 with Ankurarpanam on November 19. and Koil Alwar Tirumanjanam on November 15.

As the annual event is taking place after a two-year hiatus due to Covid pandemic, the Vahana Sevas will be performed in the presence Every day the vahana sevas will be observed between 8am and 10am in the morning and 7pm and 9pm.

Important days includes Dhwajarohanam on November 20, Gaja Vahanam on November 24, Swarna Ratham and Garuda Vahanam on November 25, Rathotsavam on November 27 and Dhwajavarohanam on November 28.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
 
 తిరుపతి, 2022 నవంబరు 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 19వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 15వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత ఆలయ మాడ వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు..
 
వాహనసేవల వివరాలు :
 
తేదీ ఉదయం రాత్రి 
 
20-11-2022 (ఆదివారం) ధ్వజారోహణం చిన్నశేషవాహనం
 
21-11-2022(సోమవారం) పెద్దశేషవాహనం హంసవాహనం
 
22-11-2022(మంగళవారం) ముత్యపుపందిరి వాహనం        సింహవాహనం
 
 
23 -11-2022(బుధవారం)   కల్పవృక్ష వాహనం    హనుమంతవాహనం 
 
 
24 -11-2022(గురువారం) పల్లకీ ఉత్సవం  గజవాహనం
 
25-11-2022(శుక్రవారం) సర్వభూపాలవాహనం       స్వర్ణరథం, గరుడవాహనం
 
26-11-2022(శనివారం) సూర్యప్రభ వాహనం   చంద్రప్రభ వాహనం
 
27-11-2022(ఆదివారం) రథోత్సవం     అశ్వ వాహనం
 
28-11-2022(సోమవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.