KARTHIKA DEEPAM LIT ATOP THE HILLOCK IN KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం
TIRUPATI, 13 DECEMBER 2024: The auspicious festival of ” Karthika Deepotsavam ” was performed with utmost religious ecstasy in the Lord Siva temple in Kapilateertham amidst the chanting of Siva Nama-“Hara Hara Mahadeva Sambho Shankara” by scores of devotees thronging the temple on Friday evening.
Due to incessant rainfall, the velocity of the torrent has also increased. As such the devotees are not allowed to enter the temple tank. The women devotees, lit the ghee lamps and performed special puja in the temple premises.
The temple priests lit ghee lamps inside Garbhalayam, over the top of the temple, on the hill top.
JEO Smt Goutami, VGO Smt Sada Lakshmi, DyEO Sri Devendra Babu and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం
తిరుపతి, 2024 డిసెంబర్ 13: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం నిర్వహించారు.
భక్తుల శివనామ స్మరణ-“హర హర మహాదేవ శంభో శంకర” అనే మంత్రోచ్ఛారణల మధ్య “కార్తీక దీపోత్సవం” అత్యంత భక్తి పారవశ్యంతో జరిగింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం వేగం కూడా పెరిగింది. దీంతో ఆలయంలోని పుష్కరిణిలోనికి భక్తులను అనుమతించరు. ఆలయ ప్రాంగణంలో మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి గౌతమి, వీజీవో శ్రీమతి సదా లక్ష్మి, డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.