KARTHIKA DEEPOTSAVAM FILLS DEVOTIONAL WAVES _ తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం
ANUGRAHA BHASHANAM BY KURTALAM PONTIFF
DEEPA LAKSHMI DANCE ADDS GRANDEUR
HUNDREDS PARTICIPATE
TIRUPATI, 18 NOVEMBER 2024: The Karthika Deepotsavam observed by TTD on Monday evening filled with devotional vibrations as hundreds participated in this community divine ghee lamp lighting event.
Kurtalam Pontiff Sri Siddheswara Bharati Theertha Swamy in his Anugraha Bhashanam said Karthika month happens to be the holiest month among all.
Earlier the students from SV College of Music and Dance who performed Deepa Lakshmi danced in a befitting manner.
EO Sri J Syamala Rao, board members Sri J Krishnamurthy, Sri Bhanuprakash Reddy and others were present.
The event was telecasted live on SVBC for the sake of global devotees.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
దీపోత్సవం జ్ఞాన జ్యోతులు వెలిగించాలి : కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి స్వామిజీ
– తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం
• గోవిందనామస్మరణతో మారుమోగిన టీటీడీ పరిపాలన భవనం మైదానం
• భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
తిరుపతి, 2024 నవంబరు 18: వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తీకమాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి స్వామిజీ ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి స్వామిజీ అనుగ్రహ భాషణం చేస్తూ దీపాన్ని వెలిగిస్తే మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.
శివ కేశవుల వైశిష్ట్యం, దీపం ప్రాముఖ్యత, దీపారాధన వల్ల అజ్ఞానమనే చీకటిని పారద్రోలి ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానదీపాలు వెలిగించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నానని చెప్పారు.
దైవనామాన్ని జపిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షం కలగాలని స్వామీజీ ఆకాంక్షించారు.
కార్తీక మహా దీపోత్సవం ఇలా …
ముందుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వేదపండితులు యతి వందనం, వేదస్వస్తి అనంతరం దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.
టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు, బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణ మూర్తి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు,, హెచ్డీపీపీ ప్రత్యేక అధికారి శ్రీ రాజగోపాల్, సెక్రటరీ రఘునాథ్, అడిషనల్ సెక్రటరీ శ్రీ రాంగోపాల్, అర్చక బృందం, వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.