KARTHIKA DEEPOTSAVAM IN KT ON NOV 19 _ నవంబరు 19న శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
Tirupati, 18 Nov. 21: Karthika Deepotsavam will be observed on November 19 in Sri Kapileswara Swamy temple.
Due to covid guidelines that festival will be observed in Ekantam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 19న శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
తిరుపతి, 2021, నవంబరు 18: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు దీపారాధన, కృత్తికా దీపోత్సవం నిర్వహిస్తారు. ముందుగా గర్భాలయంలో, తరువాత ఆలయ శిఖరంపైన దీపారాధన చేస్తారు. రాత్రి 7.30 గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటుచేస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.