KARTHIKA VANABHOJANAM HELD AT TIRUMALA _ తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం

Tirumala, 22 Nov. 20: The annual Karthika Vanabhojanam programme held in the lush green woods at Paruveta Mandapam in Tirumala on Sunday with religious fervor. 

Earlier the utsava murthies of Sri Malayappa along with Sridevi and Bhudevi were brought to the mandapam in a colourful procession and snapana tirumanjanam was performed amidst the rhythmic chanting of Purusha, Narayana, Sri, Bhu, and Neela Sooktams by Vedic pundits.

Later the artists of Annamacharya Project presented some melodious sankeertans followed by the instrumental rendition of some more kritis while Harikatha Parayanam on Garudadri Vaibhavam was an added attraction to the event.

 

Speaking on this occasion, the Additional EO Sri AV Dharma Reddy said, usually tens of thousands of devotees converge in the green woods for this most important community dining programme. But due to Covid restrictions, we have limited this number to just a couple of hundreds. The entire event went off in a colourful way.

 

After the Pooja and Nivedana to deities, the community dining programme, Karthika Vanabhojanam was organised and the devotees cherished the Annaprasadam under the Amla trees at Paruveta Mandapam. Later the deities were taken back to the temple.

 

TTD has cancelled Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, and Sahasra Deepalankara Seva on Sunday following this fete.

Board Member Sri Murali Krishna, DyEOs Sri Harindranath, Sri Balaji, Sri Nagaraja, Health Officer Dr RR Reddy, DFO Sri Chandrasekhar, EEs Sri Jaganmohan Reddy, Sri Mallikarjuna Prasad, Sri Srihari, Sri Chandrasekhar, VGO Sri Bali Reddy, Temple Peishkar Sri Jaganmohanacharya, Potu Peishkar Sri Srinivasulu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం

తిరుమల, 2020 నవంబరు 22: కార్తీక వన భోజన మహోత్సవం ఆదివారం తిరుమల పార్వేట మండపంలో వైభవంగా జరిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి ఏడాదీ పవిత్రమైన కార్తీకమాసంలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఇందులో భాగంగా ఈసారి కోవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కార్య‌క్ర‌మాన్ని 250 మంది భ‌క్తుల‌తో ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన‌ట్టు చెప్పారు.

ముందుగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం పార్వేట మండపం వ‌ద్ద‌ మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. శాక్సాఫోన్, డోలు, నాదస్వర వాయిద్య సంగీతం ఆకట్టుకుంది. అనంత‌రం గ‌రుడ వైభ‌వం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బోర్డు స‌భ్యులు శ్రీ ముర‌ళీకృష్ణ‌, ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి‌, శ్రీ నాగరాజ, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య పేష్కార్ శ్రీ జగన్ మోహనాచార్యులు, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాస్, ఎవిఎస్వోలు శ్రీ గంగ‌రాజు, శ్రీ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.