KARTHIKA VANABHOJANAM IN EKANTAM AT TIRUMALA _ నవంబరు 22న ఏకాంతంగా కార్తీక వనభోజనం
Tirumala, 21 Nov. 20: Following Covid norms, TTD will be observing Karthika Vana Bhojanam in Ekantam at Paruveta Mandapam on Sunday.
A restricted less than 200 staff members belonging various departments who will be accompanying the procession of deities will alone be permitted to take part in the community dining programme.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 22న ఏకాంతంగా కార్తీక వనభోజనం
తిరుమల, 2020 నవంబర్ 21: కార్తీక వనభోజన కార్యక్రమం నవంబరు 22వ తేదీన ఆదివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలో(200 మందికి మించకుండా) అధికారులు, సిబ్బందితో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
ఇందుకోసం ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకీపై ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఉదయం 10 గంటలకు పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.
కార్తీక వనభోజనం కారణంగా ఆదివారం శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.