KARTIKA VANABHOJANAM VENUE CHANGED _ నవంబరు 27న వర్షం కారణంగా శ్రీనివాసమంగాపురం ఆలయంలోనే కార్తీక వనభోజనం
Tirupati, 26 November 2024: Due to incessant rains, the Kartika Vanabhojanam program at Srinivasa Mangapuram will be held in Sri Kalyana Venkateswara Swamy temple premises itself on November 27.
In the holy month of Kartika, on the day of Dwadashi, it is a tradition to organize Vanabhojanam every year.
Devotees are requested to make note of this.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 27న వర్షం కారణంగా శ్రీనివాసమంగాపురం ఆలయంలోనే కార్తీక వనభోజనం
తిరుపతి, 2024 నవంబరు 26: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 27న కార్తీక వనభోజన కార్యక్రమం వర్షం కారణంగా ఆలయంలోనే జరుగనుంది.
పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఇక్కడ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేయాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఆలయంలోనే వన భోజనం కార్యక్రమం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. యథావిధిగా ఇతర కార్యక్రమాలను ఆలయంలోనే నిర్వహించనున్నారు. వర్షం కారణంగా కార్యక్రమ నిర్వహణ స్థలాన్ని ఆలయానికి మార్చిన విషయాన్ని భక్తులు గమనించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.