KASYAPA JAYANTHI OBSERVED _ తిరుమలలో ఘనంగా శ్రీ కశ్యప మహర్షి జయంతి
TIRUMALA, 03 AUGUST 2022: Sri Kasyapa Maharshi Jayanthi was observed in Asthana Mandapam in Tirumala on Wednesday.
Speaking on the occasion, Vaikhanasa Agama Advisor Sri Vedantam Vishnu Bhattacharyulu said among the disciples of Sri Vikhanasa Maharshi, Kasyapa Maharshi was one who penned Gnana Kanda book which has Vaikhanasa norms.
This religious event was organised by Alwar Divya Prabandha of TTD and Sri Vaikhanasa Divya Sidhanta Vivardhini.
Renowned scholar Sri Sitaramacharyulu and other pundits were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ఘనంగా శ్రీ కశ్యప మహర్షి జయంతి
తిరుమల, 2022 ఆగస్టు 03: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విధానానికి శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రం మూలమని టీటీడీ వైఖానస ఆగమసలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వైఖానస మహర్షి శిష్యులలో ఒకరైన శ్రీ కశ్యప మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు మాట్లాడుతూ వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో కూడినదని దేవాలయ సంస్కృతికి మూలమైన వేదమంత్రాలతో జరిపే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పారు. వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు ఉత్సవాలు శ్రీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని, ఈ ఆగమ శాస్త్రాన్ని శ్రీ కశ్యప మహర్షి జ్ఞానకాండ గ్రంథంలో వైఖానస విధివిధానాలతో సమగ్రంగా వివరించారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు శ్రీ సీతారామాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.