KAT AT SRI PAT ON NOV 3 _ న‌వంబ‌రు 3న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 2 Nov. 20: Ahead of the Sri Padmavati Ammavari annual Brahmotsavam from Nov 11-19, the TTD is organising temple cleansing ceremony of Koil Alwar Thirumanjanam on November 3.

As per COVID-19 guidelines the program will be observed in ekantham by temple Archakas and TTD staff only.

Earlier in the day Koil Alwar Thirumanjanam will be performed with Desi herbs and perfumed waters all over the temple including walls, corridors, roof, puja materials etc.

ANKURARPANAM ON NOVEMBER 10

TTD is organising Ankurarpanam ceremony on November 10 mornings for the annual Brahmotsavam. As part of the same Laksha kumkumarchana is conducted in the afternoon followed by Punya Havachanam, Raksha bandhan, Senadhipati utsava and Ankurarpanam at the yagashala.

Pushpa yagam will be performed on November 20.

Following are the details of vahana sevas.

11-11-2020(Wednesday)

Morning Dwajavarohanam-

Evening- Chinna Sesha vahana

12-11-2020(Thursday)

Morning – Pedda Sesha vahana

Evening- Hamsa vahana

13-11-2020(Friday’

Morning- Muthyapu pandiri vahana

Evening- Simha vahana

14-11-2020(Saturday)

Morning- Kalpavruksha vahana

Evening – Hanumanta vahana

15-11-2020(Sunday)

Morning- Pallaki vahana

Evening- Gaja vahana

16-11-2020(Monday)

Morning- Sarvabhupala vahana

Evening- Garuda vahana

17-11-2020(Tuesday)

Morning Surya Prabha vahana

Evening  – Chandra Prabha vahana

18-11-2020(Wednesday)

Morning- Sarva bhupala vahana

Evening- Aswa vahana

19-11-2020(Thursday)        

 Morning- Panchami thirtha

Evening- Dwajavarohanam

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 3న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2020 నవంబరు 02: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 11 నుండి 19వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో న‌వంబ‌రు 3వ తేదీ మంగ‌ళ‌వారం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప‌రిమిత సంఖ్య‌లో సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు.

ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

న‌వంబ‌రు 10న అంకురార్ప‌ణ

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు న‌వంబరు 10వ తేదీన అంకురార్పణ ఏకాంతంగా జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. న‌వంబ‌రు 20న పుష్ప‌యాగం ఏకాంతంగా జ‌రుగ‌నుంది. ఏకాంతంగా జ‌రుగ‌నున్న బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ                                     ఉదయం                                       రాత్రి

11-11-2020(బుధ‌వారం)      ధ్వజారోహణం                           చిన్నశేషవాహనం

12-11-2020(గురువారం)     పెద్దశేషవాహనం                       హంసవాహనం

13-11-2020(శుక్ర‌వారం)   ముత్యపుపందిరి వాహనం              సింహవాహనం

14-11-2020(శ‌నివారం)        కల్పవృక్ష వాహనం                     హనుమంతవాహనం

15-11-2020(ఆదివారం)          పల్లకీ ఉత్సవం                                    గజవాహనం

16-11-2020(సోమ‌వారం)     సర్వభూపాలవాహనం       స్వర్ణరథం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), గరుడవాహనం

17-11-2020(మంగ‌ళ‌వారం)     సూర్యప్రభ వాహనం                    చంద్రప్రభ వాహనం

18-11-2020(బుధ‌వారం)        రథోత్సవం(స‌ర్వ‌భూపాల వాహ‌నం)            అశ్వ వాహనం

19-11-2020(గురువారం)         పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో)               ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.