KAT IN KRT ON MARCH 27 _ మార్చి 27న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 25 Mar. 22: In connection with the annual brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati from March 30 to April 7, Koil Alwar Tirumanjanam will be performed on March 27.

After the morning rituals, this traditional temple cleansing fete will take place between 6.30am and 9am and later the devotees will be allowed for darshan.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 27న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
 
తిరుపతి, 2022 మార్చి 25: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 27వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్‌ 7వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.ఈ నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
 
ఈ సందర్భంగా మార్చి 27న‌ తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.
 
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.