KIOSK FOR “ANNA PRASADAM” DONATION IN TIRUMALA _ తిరుమలలో ”అన్నప్రసాదం” విరాళానికి కియోస్క్ మిషన్లు ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
Tirumala, 20 November 2024: TTD has set up a Kiosk at Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex (MTVAC) in Tirumala to make donations to the SV Anna Prasadam Trust run by TTD.
This Kiosk was inaugurated by TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary on Wednesday which was donated to TTD by Canara Bank.
Through these Kiosk, devotees can easily donate to the SV Anna Prasadam Trust ranging from Rs. 1 to Rs. 99,999, by scanning the QR code on the Kiosk and making a donation through UPI.
Speaking to the media on this occasion, the Additional EO said that this Kiosk is made available as a part of the complete digitalization of TTD. He informed that more kiosks will be set up in the future.
Deputy EOs Sri Lokanatham, Sri Rajendra, Canara Bank DGM Sri Ravindra Agarwal, AGM Sri Nagaraju Rao, Tirumala Branch Manager Sri Raghavan, and others participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ”అన్నప్రసాదం” విరాళానికి కియోస్క్ మిషన్లు ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
తిరుమల, 2024 నవంబరు 20: టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్(KIOSK) మిషన్ ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ ను కెనరా బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సులభతరంగా విరాళం అందిచవచ్చు. రూ.1 నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని భక్తులు కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా విరాళం ఇవ్వవచ్చు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీని పూర్తిగా డిజటలైజేషన్ చేయడంలో భాగంగా ఈ మిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, కెనరా బ్యాంకు డీజీఎం శ్రీ రవీంద్ర అగర్వాల్, ఏజీఎం శ్రీ నాగరాజు రావు, తిరుమల బ్రాంచ్ మేనేజర్ శ్రీ రాఘవన్, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.