KODANDA RAMA RIDES ON MIGHTY GARUDA _ గరుడ వాహనంపై సీతాపతి

VONTIMITTA, 14 APRIL 2022: Sri Kodanda Rama took out a celestial ride on the mighty Garuda Vahanam as part of ongoing annual Brahmotsavams in Vontimitta in YSR Kadapa District.

On the fifth day evening on Thursday, the Garuda vahana Seva took place with religious aplomb.

Temple staffs and a large number of devotees converged to see the majestic Sri Rama on the mighty ave carrier.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

గరుడ వాహనంపై సీతాపతి
 
తిరుపతి, 2022 ఏప్రిల్ 14: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 8.30 గంటల వరకు జరగనుంది.  భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.
 
వాహ‌న‌సేవ‌లో  డెప్యూటీ ఈఓ శ్రీ రమణప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.