KOIL ALWAR HELD IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 24 October 2024: Ahead of Deepavali Asthanam on October 30, the Koil Alwar Tirumanjanam (temple cleansing ritual) was performed at Sri Govindaraja Swamy temple on Thursday.
As part of fete the walls, roofs, puja materials etc. of Sri Govindaraja Swamy temple along with other sub-temples in the temple complex were cleaned with water mixed with spices such as Namakopu, Srichurnam, Musk, Turmeric, Pachchaku, Camphor, Sandalwood powder, Saffron, Kichiligadda – a tuber.
Later on the devotees were allowed for Darshan.
On the occasion of Deepavali festival on October 30, special Diyas will be lit at Srivari Sannidhi, Sri Parthasarathi Swamy, Sri Andal Ammavaru, Sri Kalyana Venkateswara Swamy, Sri Pundarikavalli Ammavaru, Sri Bhashyakarula Varu sannidhis within the temple complex.
On the occasion of Deepavali Asthanam, special oils lamps brought from the Sri Pundarikavalli Ammavari temple are offered to the presiding deity.
Deputy EO of the temple Smt Shanti, Superintendent Sri Chiranjeevi, Temple Inspector Sri Dhananjayulu and archakas were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2024 అక్టోబరు 24: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
అక్టోబరు 30వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీవారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, శ్రీ భాష్యకారుల వారికి, తైల సమర్పణ నిర్వహించనున్నారు.
అక్టోబర్ 31న సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు దీపావళి ఆస్థానం వైభవంగా జరుగనుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు, అర్చక బృందం పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.