KOIL ALWAR HELD IN VAKULAMATA TEMPLE _ శ్రీ వ‌కుళ మాత ఆల‌యంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం 

TIRUPATI, 06 JUNE 2023: In connection with the first-anniversary fete of Vakulamata temple near Perurubanda on June 13, Koil Alwar Tirumanjanam was observed on Tuesday in the temple.

The temple and its premises were cleansed with an aromatic, sacred mixture called Parimalam.

On June 13, Vishwaksena Aradhana, Punyahavachanam, Raksha Bandhanam, Agni Pratista, Kalasaradhanam, Maha Shanti Homam, Purnahuti, Astottara Sata Kalasabhishekam to Utsava deity will be observed between 8am and 12noon.

Special Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurty, Temple Inspector Sri Sivaprasad participated in Koil Alwar Tirumanjanam.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీ వ‌కుళ మాత ఆల‌యంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుపతి, 2023 జూన్ 06: తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ ( పేరూరు బండ‌పై) వద్ద వున్న శ్రీ వ‌కుళ‌ మాత ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారు.

జూన్ 13న వార్షికోత్సవం :

జూన్ 13 వతేదీ శ్రీ వకుళ మాత ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఉద‌యం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు విశ్వక్సేనారాధన, పుణ్యాహవ‌చ‌నం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, కలశారాధన, మహా శాంతి హోమం, పూర్ణాహుతి , అమ్మవారి ఉత్సవరులకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్రమంలో ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో
శ్రీ గురుమూర్తి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివప్రసాద్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.