KOIL ALWAR IN TIRUCHANOOR _ నవంబరు 7న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATI, 04 NOVEMBER 2023: The traditional temple cleansing fete Koil Alwar Tirumanjanam will be observed in Tiruchanoor on November 7.
In connection with the ensuing annual Brahmotsavams, the Koil Alwar Tirumanjanam will be observed in Sri Padmavathi Ammavari temple on Tuesday between 6am and 9am.
TTD has cancelled Kumkumarchana and VIP Break darshan owing to this ritual. Devotees will be allowed for darshan after 9:30am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
నవంబరు 7న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2023 నవంబరు 04: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 7వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు.
ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఈ కారణంగా కుంకుమార్చన సేవ, బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.