KOIL ALWAR THIRUMANJANAM ON MAY 24 AT NARAYANAVANAM TEMPLE _ మే 24న వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Tirupati, May 23, 2026: Koil Alwar Thirumanjanam will be observed at Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam, on May 24 from 8.15 AM to 12.45 PM ahead of the annual Brahmotsavams commencing from May 28.

The temple premises and puja articles will be ceremonially cleansed and purified as part of the traditional ritual. Devotees will be allowed for Sarva Darshan from 2.30 PM onwards.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

మే 24 వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

నారాయణవనంలో దివ్యంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ శుద్ధి మహోత్సవం

తిరుపతి, 2026, మే 23: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 8.15 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పవిత్ర కార్యక్రమం జరుగనుంది.

మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ పవిత్రత, శోభను మరింత పెంపొందించే ఉద్దేశంతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను శుద్ధి జలాలతో పరిశుభ్ర్రం చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.