KOIL ALWAR TIRUMANJANAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE ON MAY 18 _ మే 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, May 15, 2026: Koil Alwar Thirumanjanam will be observed at Sri Govindaraja Swamy Temple on May 18 in connection with the annual Brahmotsavams commencing from May 23.
Special rituals including Suprabhatham, Thomala Seva, Koluvu and Panchanga Sravanam will be performed in the early morning. The temple cleansing ritual will take place from 7am to 9am.
During the ritual, the temple premises and puja articles will be purified and sacred scented water mixed with traditional ingredients will be sprinkled throughout the temple.
Devotees will be allowed for Sarvadarshan from 9.30am onwards.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2026 మే 15: కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు.
ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే ఈ విశిష్ట కార్యక్రమం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితరాలను శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
