KOIL ALWAR TIRUMANJANAM AT SRI KALYANA VENKATESARA SWAMY TEMPLE ON JULY 16 _ జూలై 16న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, July 11, 2026: Koil Alwar Tirumanjanam will be observed at the Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram, on July 16, ahead of the annual Salakatla Sakshatkara Vaibhavotsavams to be held from July 17 to 19.
The rituals will begin with Suprabhatham, followed by Thomala Seva, Koluvu and Panchanga Sravanam. Koil Alwar Tirumanjanam will be performed from 6.30 a.m. to 11.30 a.m.
During the ceremony, the temple premises, walls, ceiling and puja articles will be cleansed and sanctified by sprinkling holy water mixed with fragrant ingredients. Devotees will be allowed for darshan from 12.30 p.m. onwards.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జూలై 16న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2026 జూలై 11: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం అనంతరం ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని పవిత్ర జలంతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
