KOIL ALWAR TIRUMANJANAM AT SRI PADMAVATHI AMMAVARI TEMPLE ON APRIL 28 _ ఏప్రిల్ 28న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, April 19, 2026: Koil Alwar Thirumanjanam will be conducted with religious fervour on April 28 at Sri Padmavathi Ammavari Temple, Tiruchanur, as a prelude to the annual Vasanthotsavams scheduled from April 30 to May 2.
The ritual will commence with Suprabhatam, followed by the purification ceremony from 6:00 AM to 9:00 AM, during which the temple premises and puja materials will be cleansed. Devotees will be allowed for darshan from 9:30 AM onwards.
Kalyanotsavam and Sahasra Deepalankara Seva stand cancelled on April 28.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 28న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2026 ఏప్రిల్ 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 28న కోయిల్‌ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 30 నుండి మే 2వతేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. వసంతోత్సవాల సందర్భంగా ఆలయంలోకోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటలవరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలుకలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9. 30 గంటల నుండిభక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఈ కారణంగా ఏప్రిల్ 28న కల్యాణోత్సవం , సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
