KOIL ALWAR TIRUMANJANAM HELD _ మే 19 నుండి 27వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 13 MAY 2025: The annual brahmotsavams in Sri Venugopala Swamy temple in Karvetinagaram are scheduled from May 19 to 27 and in connection with this the Koil Alwar Tirumanjanam was observed on Tuesday.

The temple officials participated in this traditional temple cleansing ritual which was observed from 7:30am till 11am. Later the devotees are allowed for darshan.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 19 నుండి 27వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

– ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి, 2025 మే 13: కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 19 నుండి 27వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 18వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం:

శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో మంగళవారం ఉదయం 7.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 28వ తేదీన మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

19-05-2025

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం – పెద్దశేష వాహనం

20-05-2025

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం – హంస వాహనం

21-05-2025

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

22-05-2025

ఉదయం – కల్పవృక్ష వాహన

సాయంత్రం – ఆర్జితకళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం

23-05-2025

ఉదయం – మోహినీ అవతారం

సాయంత్రం – గరుడ వాహనం

24-05-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజ వాహనం

25-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

26-05-2025

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

27-05-2025

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో మే 22వ తేదీ సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.