KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

SCREENS DONATED

 

TIRUPATI, 24 JANUARY 2023: In connection with Radha Sapthami Koil Alwar Tirumanjanam was observed in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on Tuesday.

 

After Suprabhatam, Sahasranamarchana and Suddhi, the traditional temple cleansing fete was held between 6.30am and 9am. Unjal Seva was cancelled on the occasion.

 

Eight Huge screens-Paradas used for temple corridors have been donated by a Hyderabad based donor devotee Sri Srinivas.

 

Temple DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Madhu, Temple Inspector Sri Damu and other religious and office staff were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2023 జనవరి 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

8 పరదాలు విరాళం :

హైదరాబాదుకు చెందిన శ్రీ శ్రీనివాసులు అనే భ‌క్తుడు ఈ సంద‌ర్భంగా ఆలయానికి 8 పరదాలు విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.