KOIL ALWAR HELD IN TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోస్తంగా కోయిల్ ‌ఆళ్వార్ ‌తిరుమంజనం

PARADAS DONATED

TIRUPATI,  11 NOVEMBER 2025: The traditional temple cleansing ritual, koil Alwar Tirumanjanam was observed with religious fervour in Tiruchanoor temple on Tuesday.

As the Navahnika Karthika Brahmotsavams are set to commence from November 17 onwards, the entire temple is cleaned with ”Parimalam”, an aromatic mixture as a purificatory ceremony.

Donation 

Ten Paradas-curtains were donated out of seven by Hyderabad based Sri Swarnakumar Reddy and three by Tirupati based Sri Mani. 

JEO Sri Veerabraham, CV&SO Sri Muralikrishna, SP Sri Subbarayudu, DyEO Sri Harindranath and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోస్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025, నవంబర్ 11: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

10 పరదాలు అమ్మవారికి బహుకరణ:

హైదరాబాద్ కు చెందిన శ్రీ స్వర్ణకుమార్ రెడ్డి ప్రతినిధులు అమ్మవారి ఆలయంలో మంగళవారం 7 పరదాలను,  అదేవిధంగా తిరుపతికి చెందిన శ్రీ మణి 3 పరదాలను డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్,  అర్చకులు శ్రీ బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీ ఎం. రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ రమేశ్, ఆలయ ఇన్పెక్టర్లు శ్రీ చలపతి, సుబ్బరాయుడు త‌దితరులు పాల్గొన్నారు.

వాహన సేవల వివరాలు, సమయం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలలో విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి  25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

  17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం)      చిన్నశేషవాహనం

  18-11-2025 (మంగళ వారం) పెద్దశేషవాహనం                     హంసవాహనం

  19-11-2025 (బుధవారం)     ముత్యపుపందిరి వాహనం        సింహవాహనం

  20 -11-2025 (గురువారం)   కల్పవృక్ష వాహనం                  హనుమంత వాహనం

  21 -11-2025 (శుక్ర వారం)      పల్లకీ ఉత్సవం                           గజవాహనం

   22-11-2025 (శనివారం)     సర్వభూపాలవాహనం      సా.  స్వర్ణరథం,     గరుడవాహనం

   23-11-2025 (ఆదివారం)    సూర్యప్రభ వాహనం         చంద్రప్రభ వాహనం 

  24-11-2025 (సోమవారం)      రథోత్సవం                   అశ్వ వాహనం 

  25-11-2025 (మంగళవారం)     పంచమీతీర్థం               ధ్వజావరోహణం.

  • నవంబర్ 26నపుష్పయాగం.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.