KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tiruchanoor, 18 May 2021: Koil Alwar Tirumanjanam in connection with the annual Vasanthotsavams was held in Tiruchanoor on Tuesday.
The entire temple premises were cleansed with Parimalam. Later devotees were allowed for Darshan.
The annual Vasanthotsavams are scheduled from May 25 to 27 with Ankurarpanam on May 24.
Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Smt Malleswari and other temple staffs were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2021 మే 18: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించారు. ఆనంతరం ఉదయం 8 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ ఆర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.